![]() |
![]() |
.webp)
కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమోలో శివ్ - పరి మధ్య గొడవ అయ్యింది. ఇక నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి ఫెస్టివల్ థీమ్ ఇచ్చింది శ్రీముఖి. ఇందులో అమరదీప్, విష్ణు ప్రియా, ప్రియాంక జైన్ వంటి వాళ్లంతా వచ్చారు. ఇక అమరదీప్ ఐతే "మనం అంతా ఐక్యంగా ఉండి ఆడితేనే గెలుస్తాం" అని చెప్పాడు. దానికి ఇమ్మానుయేల్ కౌంటర్ ఇచ్చాడు. "ఫస్ట్ ఎపిసోడ్ లో మనమంతా కలిసి ఇంతకంటే చాలా ఎక్కువగానే అనుకున్నాం" అంటూ కౌంటర్ వేసాడు. ఇంతలో విష్ణుప్రియకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది శ్రీముఖి. "నువ్వు ఒక్క అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి.
అదిగో ఐశ్వర్య..అసలే పృద్వి మీద ఆమె మనసు పారేసుకుంది. మొన్నే హగ్గులు వరకు వెళ్ళింది కథ " అంటూ ఆమెను చూపించింది. ఇక విష్ణు ప్రియా ఐతే "ఇట్స్ ఓకే. నాకు పృద్వి మీద నమ్మకం ఉంది..ఇట్స్ ఓకే అక్కడ ఎం చేయరు " అని చెప్పింది ఎంతో నమ్మకంతో. "ఇంతలో శివ్ లేచి ప్రియాంక జైన్ వైపు రాబోతుంటే ఆమె ఫుల్ ఫైర్ అయ్యింది. "అక్కడే ఆగు. నువ్వేమన్నావ్..తొక్కలో పరి అన్నావ్...తొక్కలో శివ్ .. రాకు నా దగ్గరకు నువ్వు" అంటూ అరిచింది. ప్రియాంక కోపాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంతలో శివ్ కూడా "ఓయ్ పోవే..చూసుకుందాం పోవే" అన్నాడు శివ్..వెంటనే ప్రియాంక కూడా "ఓయ్ పోరా" అంది...నిజానికి ఇంతకుముందు ఎపిసోడ్స్ లో శివ్ ప్రియాంకను తొక్కలో పరి.. టైటిల్ విన్ అయ్యేవరకు పరిని వదిలిస్తున్నా అని చెప్పాడు. అతని మాటలు విన్న ప్రియాంకకు బాగా కోపం వచ్చింది. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడావ్ అంటూ బాధపడింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో ఆమె తన రివెంజ్ తీర్చుకుంది.
![]() |
![]() |